Monday, January 3, 2011

కాల్పుల్లో మద్దెలచెర్వు సూరి మృతి, ధ్రువీకరించని అపోలో వైద్యులు

హైదరాబాద్ : కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూరి కాల్పుల్లో మరణించాడు. హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించినట్లు సమాచారం. హైదరాబాదులోని యూసుఫ్ గుడాలోని నవోదయ కాలనీలో అతనిపై సోమవారం కాల్పులు జరిగాయి. వెంటనే అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అతని మెదడు ఏ మాత్రం పని చేయడం లేదని, హృదయ స్పందన నామమాత్రంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను మరణించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత వైద్యులు సూరి మరణ వార్తను ప్రకటించే అవకాశాలున్నాయి.కాగా, పరిటాల రవి అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని సూరి మేనల్లుడు ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఏదో జరిగింది, త్వరలోనే వివరాలు తెలుస్తాయని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఈ పనికి ఎవరు పాల్పడ్డారనే విషయం బయట పడుతుందని ఆయన అన్నారు. కాగా, నమ్మినవారే ఈ పనికి పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూరిపై దాడి నేపథ్యంలో అనంతపురం, హైదరాబాద్, విజయవాడల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఓ ఇంట్లో భోజనానికి వెళ్లి తిరిగి వస్తుండగా సూరిపై దాడి జరిగినట్లు చెబుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో ఇప్పటి వరకు మిగిలి ఉన్న నిందితుడు సూరి ఒక్కడే.
Disclaimer: ECinemaChusara.blogspot.com is an Indian movie aggregator; we reference the links from popular video sources like Megavideo, Youtube, and other video sites. We don’t upload anything and we are not responsible for any content on the external sites. If any of the videos on this site has objectionable content or violating your copyright please contact us, we will remove those links immediately.